127
సోలొమోను యాత్ర కీర్తన.
ఇల్లు కట్టేవాడు యెహోవా కాకపోయినట్లయితే
కట్టేవాడు తన పనిని వ్యర్థంగా చేస్తున్నట్టు.
పట్టణాన్ని కాపలా కాసేవాడు యెహోవా కాకపోతే
కాపలా వాళ్లు వారి సమయం వృధా చేసికొంటున్నట్టే.
నీవు వేకువనే లేవటం, చాలా ఆలస్యంగా పనిచేయటం కేవలం నీవు తినే ఆహారం కోసమే అయితే
నీవు నీ సమయం వృదా చేనుకొంటున్నట్టే.
దేవుడు తనకి ప్రియమైనవాళ్ల విషయం శ్రద్ధ తీసుకొంటాడు.
వారు నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన శ్రద్ద తీసుకొంటాడు.
పిల్లలు యెహోవానుండి లభించే కానుక.
వారు తల్లి గర్భమునుండి వచ్చే బహుమానం.
యువకుని కుమారులు, సైనికుని బాణాల సంచిలోని బాణాల్లాంటి వారు.
తన బాణాల సంచిని కుమారులతో నింపుకొనే వాడు చాలా సంతోషంగా ఉంటాడు.
ఆ మనిషి ఎన్నటికీ ఓడించబడడు. బహిరంగ స్థలాల్లో* అతని కుమారులు అతని శత్రువులనుండి అతణ్ణి కాపాడుతారు.

* 127:5: బహిరంగ స్థలాలు అక్షరార్థంగా “ద్వారము” ఎప్పుడై నా ఒక వ్వక్తి యొక్క శత్రువులు అతన్ని న్నాయ స్థానానికి తీసుకు వెళ్లాలని ప్రయత్నిస్తే అతని కుమారులు అతన్ని రక్షిస్తారు అని దీని అర్థము కావచ్చు.